టీచర్స్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగించాలి: TPTF

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఎలక్షన్ అధికారికి విజ్ఞప్తి చేసింది.

Update: 2022-12-09 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఎలక్షన్ అధికారికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం రవిందర్ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అఫీసర్‌కు లేఖ రావారు. తప్పుడు సర్టిఫికేట్‌లను అరికట్టేందుకు ఇన్‌స్టిట్యూషన్స్ హెడ్‌లు జారీ చేసిన సర్వీస్ సర్టిఫికేట్‌పై యూనివర్సిటీ అధికారులు పక్కాగ వెరిఫై చేస్తున్నారని తెలిపారు.

ఎన్‌రోల్‌మెంట్‌ను నిర్ధారించడానికి విశ్వవిద్యాలయాల ద్వారా ధృవీకరణ చేయడం చాలా సమయం తీసుకుంటోందని, అందువల్ల కళాశాలలకు సమయం సరిపోదన్నారు. సర్టిఫికేషన్‌కు డిసెంబర్ 9 చివరి తేదీ అని తెలిపారు. నోటిఫికేషన్ తేదీ నుంచి సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించి ఉంటే, సమయం సరిపోయేదని అభిప్రాయ పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియ నవంబర్ 2022 మధ్యలో ప్రారంభించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరిని నమోదు చేసుకోవడంలో సహాయపడేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాన్ని కనీసం పది రోజుల పాటు పొడిగించాలని ఈసీకి లేఖలో తెలిపారు. 

Similar News