BRSకు బిగ్ షాక్.. సోషల్ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్

బీఆర్ఎస్ నేత, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-02 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సర్క్యూలేట్ చేసిన కేసులో నల్లగొండ జిల్లా పరిధిలో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆయనను ఆపిన పోలీసులు చౌటుప్పల్‌కు పీఎస్‌కు తరలించారు. ఆయనపై ఐపీసీ 466, 468, 505(1) సహా మొతం ఆరు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఫేక్ నోటీసును సృష్టించిన మన్నె క్రిశాంక్‌పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.  పోలీసులు క్రిశాంక్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. 

Similar News