ధరణి పోర్టల్ అధికార పార్టి నాయకులకే ఉపయోగంగా ఉంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత దాని ద్వారా రైతులకు భూ వివాదాలు పెరుతున్నాయి.

Update: 2022-10-20 09:11 GMT

దిశ, దోమకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత దాని ద్వారా రైతులకు భూ వివాదాలు పెరుతున్నాయి. ధరణి ద్వారా రాజకీయవేత్తలకు, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా మారిందే తప్ప, రైతులకు ఉపయోగంగా లేదని బీజేపీ మండల అధ్యక్షులు చింతల రాజేష్ అన్నారు. గురువారం దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలొ తహసీల్దారు శాంతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ను తక్షణమే తొలగించాలని, దాని ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

ధరణిపోర్టల్ ద్వారా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ కాటెపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండలాల వారీగా వారి సమస్యలను తీసుకువస్తున్నామన్నారు. వాటిని కూడా తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపాల్ లక్ష్మణ్, అనుపాటి నరేందర్, రవీందర్, విఠల్ రెడ్డి, నర్సింలు, కొండల్ రెడ్డి, నారాయణరెడ్డి , రాజు, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News