పేషెంట్ భర్త పై డాక్టర్ దాడి

నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మనూరు మండలం శెల్గిరా గ్రామానికి చెందిన ప్రసాద్ తన భార్య లావణ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Update: 2024-03-29 16:04 GMT

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మనూరు మండలం శెల్గిరా గ్రామానికి చెందిన ప్రసాద్ తన భార్య లావణ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిటీ స్కాన్ కోసం నారాయణఖేడ్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తీసుకొని వచ్చిన తర్వాత ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ బయట ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడనే డబ్బులు నాలుగు వేలు ఇస్తే ఇక్కడనే సిటీ స్కాన్ తీస్తామని డాక్టర్ రాజ్ కుమార్ ప్రసాద్ కు తెలిపారు. గవర్నమెంట్ ఆస్పత్రిలో డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో డాక్టరు రాజ్ కుమార్ రాడుతో దాడి చేశాడు. దీంతో ఆయనకు డాక్టర్ రాజ్ కుమార్‌కు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు.

ప్రసాద్ పీపుపై రాడుతో కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఒకసారిగా ఆయన కుప్పకూలి కింద పడిపోయారు. నడవలేని పరిస్థితిలో కారులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్న పక్కన ఉన్న ఎవరూ ఆయనను కాపాడలేకపోయారని బంధువులు వాపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కు రావాలంటే జంకుతున్నారని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. ఆసుపత్రిని పట్టించుకున్న దాఖలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కట్టి ప్రజలకు ఉపయోగ లేకుండా పోయిందని వాపోయారు. ఇకనుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News