గడ్డపోతారం హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

Update: 2024-05-27 11:37 GMT

దిశ, గుమ్మడిదల :- జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో పరిశ్రమలోని కెమికల్ రసాయనిక అతి భారీ ట్యాంకులు ఒక్కసారిగా పేలడంతో భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహించే కార్మికులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News