షాపింగ్ మాల్ లో దొంగల బీభత్సం

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పి మార్ట్ షాపింగ్ మాల్ లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు షాప్ పై ఉన్న రేకులను తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు.

Update: 2024-05-27 12:55 GMT

దిశ, నంగునూరు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పి మార్ట్ షాపింగ్ మాల్ లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు షాప్ పై ఉన్న రేకులను తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఉదయాన్నే షాప్ వద్దకు వచ్చిన యజమాని నరేష్ చూసేసరికి రాత్రి దొంగలు పడ్డారని గుర్తించి రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట ఏసీపీ మధుతో పాటు రూరల్ సీఐ శ్రీను ,ఎస్సై భాస్కర్ రెడ్డి సోమవారం నాడు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యజమాని చెప్పిన విధంగా షాపు లో ఉన్న బీరువా నుండి సుమారు 6లక్షల వరకు నగదు దొంగలించినట్లు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి దొంగలను క్లూస్ టీం ద్వారా పరిశోధన జరుపుతున్నామని త్వరలో పట్టుకుంటామని వారు వివరించారు.

Similar News