ఆర్టీసీ సమస్యలపై గళమెత్తి ప్రశ్నిస్తా: హర్షవర్థన్ రెడ్డి

ఆర్టీసీ సమస్యలపై శాసన మండలిలో గళమెత్తి ప్రశ్నిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి... MLC Election campaign

Update: 2023-03-02 13:48 GMT

దిశ, మహబూబ్ నగర్: ఆర్టీసీ సమస్యలపై శాసన మండలిలో గళమెత్తి ప్రశ్నిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి జి. హర్షవర్థన్ రెడి అన్నారు. గురువారం ఆయన పాలమూరు ఆర్టీసీ ఉద్యోగులను కలసి ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగస్తుల భార్యలు, పిల్లలు, బంధువులు,స్నేహితులు వివిధ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు, కస్తూరి బా, గురుకులాలో పని చేస్తున్నట్లయితే భాద్యతగా మొదటి ప్రాధాన్యతా ఓటు తనకే వేయించేటట్లుగా భాద్యత తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఆర్టీసీ కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీలు, గత పీఆర్సీకి సంబంధించి రావలసిన బకాయల రూపంలోని బాండ్లు, డీఏలు ఇలా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా గళమెత్తి శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలదీసి ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఆర్టీసీ సమస్యలపై జరిగిన ఉద్యమాలలో అనేకసార్లు పాల్గొని టీవీలలో, పత్రికలలో ప్రభుత్వాన్ని నిలదీసినట్లు ఆయన తెలిపారు. కార్మిక, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే ఆర్టీసి నాయకులను, ఉద్యోగులను నిరంకుశంగా ప్రభుత్వం, యాజమాన్యం అణిచివేసిన సంఘనలు ఎన్నో ఉన్నాయని వాటిని నిలదీస్తానని అన్నారు. ఈ నెల 13 వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలేట్ పేపర్ లో 10 వ నెంబర్ గా తన పేరు ఉంటుందని మొదటి ఓటు తనకే వేసేలా చూడాలని ఆయన అభ్యర్థించారు.

Tags:    

Similar News