గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం

Update: 2024-05-24 13:02 GMT

దిశ,భూత్పూర్: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో గల బ్రీడ్జి సమీపంలో వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో బలంగా కొట్టి హతమార్చాడు. సమాచారం అందడంతో సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు భూత్పూర్ ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. గురువారం సాయంత్రం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో హత్యకు గురైన మహిళ, మరో వ్యక్తి కలిసి ఆంజనేయ వైన్స్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ లు , కొంతమంది సాక్షుల ద్వారా పోలీసులు సేకరించారు.

రాత్రి పొద్దుపోయిన తర్వాత భూత్పూర్ నుండి అమిస్తాపూర్ శివారులో మద్యం సేవించిన తర్వాత ఇరువురి మధ్య తగాదా జరగడం వల్లనో, ఇతర కారణాల వల్లనో, ఆ మహిళను హత్య చేసి ఆ వ్యక్తి పరార్ అయ్యాడు. మృతురాలు వయసు దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చు అని, ఎరుపు రంగు జాకెట్, పసుపు పూల రంగు చీర ధరించి ఉన్న మృతురాలి కుడి చేతి పై యాదమ్మ అని ఉన్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మృతురాలిని గుర్తించినట్లు అయితే 8712659316, 8712659350 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

Similar News