ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కేశంపేట గ్రామం చెందిన

Update: 2024-05-24 14:35 GMT

దిశ,రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కేశంపేట గ్రామం చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రేమ వివాహం పై ఇంట్లో వాళ్ళు మందలించారని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై తిరుపతి రెడ్డి వివరాల ప్రకారం మండల పరిధిలోని కేశంపేట గ్రామానికి చెందిన మల్లేష్ (24) చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో తండ్రి కొడుకుని వదిలేసి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన మల్లేష్ తన చిన్నాయన అయిన నాగరాజుతో పెరిగాడు. గత మూడు సంవత్సరాల క్రితం నుండి కేశంపేట వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఒక పాత ఇల్లు కొనుక్కొని గొర్ల దగ్గర జీతం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా ప్రేమ వివాహం పై ఇంట్లో వాళ్ళు మందలించడంతో మనస్థాపం చెందాడు. మల్లేష్ గతంలో కూడా ఇదే విషయంలో ఇంట్లో వాళ్ళు మందలించారు అని పురుగుల మందు తాగి చనిపోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయంపై మనస్థాపం చెందిన మల్లేష్ గురువారం సాయంత్రం చందాపూర్ నుంచి కేశంపేటకు వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి లోపల ఉరి వేసుకొని చనిపోయాడు. మల్లేష్ తన చిన్నాయన నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారని ఎస్ఐ తిరుపతి రెడ్డి తెలిపారు.

Similar News