త్వరలో విజయ వర్ధిని ఆయిల్ మిల్ ప్రారంభోత్సవం : చిన్నారెడ్డి

రైతుల చిరకాల వాంచ అయినటువంటి విజయవర్ధిని ఆయిల్ మిల్ ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు.

Update: 2024-05-25 13:17 GMT

దిశ, ఎర్రవల్లి: రైతుల చిరకాల వాంచ అయినటువంటి విజయవర్ధిని ఆయిల్ మిల్ ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. శనివారం అలంపూర్ నియోజకవర్గం లోని ఎర్రవల్లి మండలలో బీచుపల్లి దగ్గర ఉన్న విజయవర్ధిని ఆయిల్ మిల్లును రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అయినటువంటి విజయవర్ధిని ఆయిల్ మిల్ లో ఉన్నా పురాతన సామాగ్రిని తొలగించి అత్యధిక అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి యంత్రాలను 150 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు నిధులు సైతం మంజూరు చేయడం జరిగిందని డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు.

ఈ ఆయిల్ సామర్థ్యం పదివేల ఎకరాల్లో రైతులు పండించినటువంటి పంటను ఆయిల్ గా మార్చే సామర్థ్యం గలదిగా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అయితే నడిగడ్డ ప్రాంతంలో దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట విస్తీర్ణం చేయడం జరిగిందని, సమీప ప్రాంతాలైన నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాల లో రైతుల పండించిన పామాయిల్ గెలలను ఈ ఆయిల్ మిల్క్ తరలించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. నాటి మాజీ మంత్రి సమరసింహారెడ్డి ఆకాంక్ష మేరకు నడిగడ్డ ప్రాంతంలో ఆయిల్ మిల్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడం నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయిల్ మిల్లు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కు తుందని అన్నారు.

కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయిల్ మిల్లు మూతపడడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు అతి త్వరలో పునర్ నిర్మాణం చేసి ఉపయోగంలోకి కు తీసుకొస్తామని అన్నారు. ఈ ఫామ్ ఆయిల్ పంటల దిగుబడి ద్వారా ఒక రైతు సంవత్సరానికి లక్షల రూపాయలలో దిగుబడి తీయచ్చు అన్నారు.ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి వెంట పెబ్బేరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బిచ్చారెడ్డి, శ్రీరంగాపూర్ మండలం జెడ్పిటిసి రాజేంద్రప్రసాద్.కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ వర్ధన్ రెడ్డి. తదితరులు ఉన్నారు.

Similar News