కోస్గి బస్ స్టాండ్‌లో దొంగల హల్‌చల్

నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఎల్లప్పుడూ రద్దీగా

Update: 2024-05-24 12:54 GMT

దిశ,కోస్గి : నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఎల్లప్పుడూ రద్దీగా ఉండే బస్ స్టాండ్ లో గత కొన్ని రోజులుగా దొంగలు హల్‌ చల్‌ చేస్తున్నారు. ఇటు మహబూబ్నగర్, పరిగి, అటు వికారాబాద్, నారాయణపేట అదేవిధంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉండే కోస్గి బస్ స్టాండ్ నుండే కాబట్టి ఎల్లప్పుడూ జనాలు ఉండటంతో పైగా పని చేయని సీసీ కెమెరాలు, బస్ స్టాండ్ లో రక్షణ కరువైంది.ఏ ఘటన జరిగిన విచారణలో పోలీసుల జాప్యం జరగడంతో అదే అదునుగా చూసుకున్న దొంగలకు పట్టే పగ్గాలు లేకుండా పోయాయి. ఇక గత నెలలో మొబైల్స్ పోయాయని పదుల సంఖ్యలో కేసులు వచ్చినా చర్యలు శూన్యం. అదే విధంగా వరకట్నం కోసమని తీసుకెళ్తున్న రూ. యాభై వేలు బస్ స్టాండ్ లో ఉండే దొంగలు మూడో కన్నుకు తెలియకుండా కొట్టేసిన చర్యలు శూన్యం.

ఇదే తరహాలో ఈ రోజు మే05,2024 శుక్రవారం నంచర్ల కు చెందిన సతీష్(35) తమ కుటుంబ సభ్యులతో కోస్గి బస్ స్టాండ్ లో మద్దూరు కు వెళ్లాలని బస్ ఎక్కుతున్న క్రమంలో దొంగలు తమ దగ్గర ఉన్న సంచిలో గల నగలను (అర్ధ తులం బంగారు కమ్మలు, పది తులాల వెండి) ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా తరుచూ దొంగలు ఇదే అదునుగా భావించిన దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని వారి నుంచి నగదు దోచుకున్నారు దొంగలు. గతంలో కోస్గి లో పని చేయని సీసీ కెమెరాలు అని వార్త వచ్చిన కూడా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయం.

Similar News