ధరణి పోర్టల్ తో భూ సమస్యలు పరిష్కారం: కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు సులభంగా పరిష్కారం చేసుకోవచ్చని కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు.

Update: 2023-05-27 09:38 GMT

దిశ, వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు సులభంగా పరిష్కారం చేసుకోవచ్చని కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో కోటి 75 లక్షల రూపాయలతో చేపడుతున్న తాసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసి రైతు వేదికలో జరిగిన సమావేశంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాసిల్దార్ కార్యాలయంలో ఒకే రోజు భూమికి సంబంధించిన క్రయవిక్రయాలు జరగటంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

పేదింటి ఆడపడుచులకు లక్ష 16 వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా అందజేయడం పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. రైతులు పంటలు పండించుకునేందుకు సాగునీటి వసతులు మెరుగు కావడంతో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారని పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్ రావు, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, తూముకుంట సొసైటీ చైర్మన్ రామన్ గౌడ్, తాసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో కథలప్పతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News