మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మన ముఖ్యమంత్రి తోనే అభివృద్ధి సాధ్యం : అశ్లేష రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రతి గెలుపు కొరకు ఆయన సతీమణి అశ్లేష రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Update: 2024-04-29 15:07 GMT

దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రతి గెలుపు కొరకు ఆయన సతీమణి అశ్లేష రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయన భార్య ఆశ్లేష రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 8వ వార్డులోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామి వారి పాదాల వద్ద కాంగ్రెస్ పార్టీ కరపత్రాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల తర్వాత ఈ జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, రాష్ట్రం జిల్లా వేగంగా అభివృద్ధి చెందాలంటే మన ఎమ్మెల్యే మన ఎంపీ మన ముఖ్యమంత్రి ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. పదేండ్ల పాలనలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు జిల్లాకు చేసింది ఏమీ లేదని అన్నారు. మన జిల్లా వాసైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను మరింత పెంచుకునే విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల కోడ్ ముగియగానే ఆరు గ్యారంటీల్లోని మిగతా పథకాలు అమల్లోకి వస్తాయని ఆమె అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో వంశీని గెలిపించాలని ఆమె కోరారు. ఆమె వెంట జడ్చర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మినాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు కుమ్మరిరాజు, చైతన్య చౌహన్, తుంగ రఘు, అనంత కిషన్, ఖాజాలిముద్దీన్, నవీన్, నరసింహులు, రాఘవేందర్, ఫయాజ్, మహిళా నాయకులు తదితరులు ఉన్నారు.

Similar News