అంబేడ్కర్ ఆశయాసాధనలో ప్రతి ఒక్కరూ నడవాలి: వీరమళ్ళ రామ్ నర్సింహ గౌడ్

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ...OU Student paid tributes to Ambedkar

Update: 2022-12-06 11:00 GMT

దిశ, సికింద్రాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉస్మానియా యూనివర్శిటీ రీసెర్చ్ స్కాలర్ వీరమల్ల రామ్ నర్సింహ గౌడ్ మంగళవారం అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ నర్సింహ గౌడ్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడం, అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశించిన విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు, గిరిజన బంధు లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

Similar News