రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-04-27 13:01 GMT

దిశ, సికింద్రాబాద్, బేగంపేట్: నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో మీ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.

Similar News