మోదీ నాయకత్వంలో 5వ ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్ : కిషన్ రెడ్డి

మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-04-27 14:10 GMT

దిశ,అంబర్ పేట: మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 3 స్థానానికి చేర్చాలన్నదే మోదీ తదుపరి లక్ష్యమని చెప్పారు. అది నెరవేరాలంటే మోదీని మరోసారి ప్రధానిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై నా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలోని గోల్నక, కాచిగూడ డివిజన్లలో పర్యటించి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు ప్రాథమిక హక్కు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మజ్లిస్ పార్టీ నిలిచే స్థానాల్లో 80 శాతం పోలింగ్ అవుతుందన్నారు.

మన ప్రాంతాలలో తక్కువ ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ విధిగా ఓటింగ్ లో పాల్గోని ఓటింగ్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. మోదీ పదేళ్ల పాలన ఎలా కొనసాగిందో అందరూ చూసారని, భద్రత, విదేశీ విధానం, ఆర్థిక విధానంలో, సంక్షేమ పథకాల అమలు ఇలా అన్నింటిలోనూ మోదీ సమర్థవంతంగా పాలన కొనసాగించారని అన్నారు. ఎంపీగా తనను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజల గౌరవాన్ని కాపాడానన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో అనేక అభివృద్ది పనులను చెపట్టానని, పేదల ప్రజలకు అండగా నిలిచానని తెలిపారు. మరోసారి నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News