హైదరాబాద్‌లో ఆ రెండు రోజులు నాన్ స్టాప్

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని 3,986 పోలింగ్ స్టేషన్లలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమితులైన ఆఫీసర్లే కీలకమైన విధులు నిర్వర్తించనున్నారు. ...

Update: 2024-05-10 03:44 GMT
  • 12న ఉ.10 నుంచి పీఓ, ఏపీఓలకు కంటిన్యూ డ్యూటీలు
  • నిరంతర విధి నిర్వహణలో 8,772 మంది పీఓ, ఏపీఓలు
  • ఎలక్షన్ మెటీరియల్ తీసుకోగానే నేరుగా పోలింగ్ స్టేషన్‌కే
  • ఉ.5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలి
  • పోలింగ్ రోజు సా.6 గంటల కల్లా లైన్‌లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు
  • ఓటర్లు ఎంత మంది ఉన్నా..ముగిశాకే మళ్లీ డీఆర్సీకి

దిశ, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని 3,986 పోలింగ్ స్టేషన్లలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమితులైన ఆఫీసర్లే కీలకమైన విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు పీఓ, ఏపీఓలతో పాటు మరో ముగ్గురు సిబ్బంది చొప్పున అయిదుగురు సిబ్బంది ఎలక్షన్ స్టాఫ్‌గా నియమితులైనప్పటికీ ముఖ్యమైన, కీలకమైన విధులు మాత్రం ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లే నిర్వర్తించనున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 3,986 పోలింగ్ స్టేషన్లలో పీఓ, ఏపీఓలు మొత్తం 7,972 మంది ఆఫీసర్లు కంటిన్యూగా ఎలక్షన్ డ్యూటీలు నిర్వహించనున్నారు. వీరిలో ఒక్క కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎంపీ ఎలక్షన్‌తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్ విధులు నిర్వర్తించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీరిలో ఇరవైశాతం మంది ఆఫీసర్లను అంటే సుమారు 800 మంది రిజర్వు పీఓ, ఏపీఓలు కూడా వీరికి సమాంతరంగా వెయిటింగ్‌లో విధులు నిర్వర్తించనున్నారు. వీరంతా ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల కల్లా తమకు కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్‌కు చేరుకుని, పోలింగ్ స్టేషన్ల వరుస నెంబర్ల ప్రకారం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్‌లను స్వాధీనం చేసుకుని, అక్కడే ఓసారి టెస్టింగ్ చేయించుకుని తీసుకోవల్సి ఉంటుంది. 12వ తేదీ ఉదయం డీఆర్సీ సెంటర్లకు వచ్చే ఈ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ మెటీరియల్ తీసుకున్న తర్వతా నేరుగా తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

13వ తేదీ ఉదయం 5 గంటలకల్లా పోలింగ్ బూత్‌కు రావాలని జిల్లా ఎన్నికల అధికారి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అయిదున్నర గంటలకు వివిధ పార్టీలకు చెందిన ఏజంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, మాక్ పోలింగ్ సమాచారం మొత్తాన్ని ఎలక్షన్ మెటీరియల్ నుంచి తొలగించి, ఉదయం 7 గంటల నుంచి సాధారణ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల కల్లా క్యూలైన్‌లోకి వచ్చిన సిబ్బందికి స్పెషల్ స్లిప్‌లను జారీ చేయాల్సి ఉంది. క్యూ లైన్‌లో ఉండి లోనికి వచ్చిన వారిని లెక్కించి, వారు సీరియల్‌గా ఓటు వేసేందుకు వీలుగా వారికి స్లిప్‌లను ఇవ్వనున్నారు. స్లిప్‌లు తీసుకున్న ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత, రాత్రి ఎంత సమయమైనా, వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్‌లను సీజ్ చేసి డీఆర్సీ సెంటర్లకు చేరుకుని, అక్కడ ఎలక్షన్ మెటీరియల్‌ను అప్పగించిన తర్వాతే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ ఇళ్లకు చేరుకునే అవకాశముంటుంది.

పోలింగ్ బూత్‌లలో ఉండే వారు అన్నీ తెచ్చుకోవాల్సిందే..

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమితులైన వారు పోలింగ్ స్టేషన్‌కు తన నివాసం దూరంగా ఉంటే ఉదయం డీఆర్సీ సెంటర్లకు వచ్చే సమయంలోనే తమకు కావల్సిన టూత్ బ్రష్, సబ్బు, అవసరమైతే ఓ జత దుస్తులు కూడా తెచ్చుకోవల్సిందే. పోలింగ్ రోజు ఉదయం వారు పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే, లేక సమీపంలోని సర్కారు ఆఫీసుల్లో గానీ ఫ్రష్ అయి తిరిగి ఉదయం 5 గంటల కల్లా ఎలక్షన్ డ్యూటీలోకి రావాల్సిందే. అయిదున్నర గంటలకు ఎట్టి పరిస్థితుల్లో మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఒక వేళ ఉదయం అయిదున్నర గంటలకల్లా వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌కు రాని పక్షంలో పీఓ, ఏపీఓలు మాక్ పోలింగ్ నిర్వహించవచ్చునని కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News