రైతులకు మరో భారీ గుడ్‌న్యూస్.. బ్యాంక్ ఖాతాల్లో పంట నష్ట పరిహారం డబ్బులు జమ.. ఎంత పడ్డాయంటే?

రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది.

Update: 2024-05-06 15:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయశాఖ నేడు (సోమవారం) సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతులకు నిధులు జమ చేయగా, సోమవారం నుంచి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం రైతులకు మరో తీపి కబురు చెప్పింది.

ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్లు గుర్తించిన సర్కార్.. తాజాగా ఇవాళ వారికి పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ లబ్ధిదారులు ఖాతాల్లో ఫండ్స్ జమ చేసింది. పంట నష్టపోయి ఆవేదన‌లో తమను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click Here For Twitter Post


Similar News