ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

శాసన మండలికి జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎన్నికలో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-27 04:30 GMT

దిశ, సూర్యాపేట : శాసన మండలికి జరుగుతున్న ఈ పట్టభద్రుల ఎన్నికలో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 457వ బూత్‌లో ఆయన మొట్ట మొదటగా ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా బూత్‌లో మొత్తం 673 ఓటర్లు ఉండగా ఎమ్మెల్యే పోలింగ్ ప్రారంభ సమయానికే వచ్చి తొలి ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా వినియోగించుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్స్ అయినందున ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ సమయంలో ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Similar News