BREAKING: తీరం దాటిన ‘రెమాల్’ తుఫాన్.. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో హై అలర్ట్

ఎట్టకేలకు బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం నుంచి రెమాల్ తుఫాన్ తీరం దాటింది.

Update: 2024-05-27 03:23 GMT

దిశ, వెబ్‌డెస్: ఎట్టకేలకు బెంగాల, బంగ్లాదేశ్ మధ్య తీరం నుంచి రెమాల్ తుఫాన్ తీరం దాటింది. గంటలకు 13 కి.మీ వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా ఈశాన్య దిశలో రెమాల్ తుఫాన్ బలహీపడుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో వాతావరణ శాక హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వెంటకు వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రెమాల్ తుఫాన్ కారణంగా పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్‌పై బలమైన గాలలు వీస్తున్నాయి. దీంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సుమారు లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో పలు విమానాలు, రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ పోర్టులో నేవీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వాన బీభత్స సృష్టించింది. వివిధ జిల్లాలో వేరువేరు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూ్ల్‌లో 8 మంది, హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బలమైన గాలులకు హైదరాబాద్ నగరంలోని పలు కాలనీల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి.     

Tags:    

Similar News