పేదల మనిషి కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు

పేదలు బాగుండాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ అంటే గిట్టనివారు బద్నాం చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని పెద్దపల్లి....MP Borlakunta Venkatesh hits out at Opposition Leaders

Update: 2022-09-23 06:35 GMT

దిశ, లక్షెట్టిపేట: పేదలు బాగుండాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ అంటే గిట్టనివారు బద్నాం చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచించి పథకాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నారా అని ప్రశ్నించారు.


మన సీఎం చేస్తున్న మంచి పనులను మెచ్చుకోవాలే తప్ప, విమర్శించడం తగదని హితవు పలికారు. మన పథకాలు ప్రజలకు దగ్గర కావడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం మన రాష్ట్రం వైపు చూస్తున్నారని గుర్తు చేశారు. బతుకమ్మ, దసరా పండుగలను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందన్నారు. ఆడపిల్లల పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందే సాయం లాంటి పథకం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు.

కేసీఆర్ పేదల మనిషి అని, ఆయన పది కాలాలపాటు చల్లగా ఉండాలని ప్రజలు దీవించాలని కోరారు. కేసీఆర్ చేసే మంచి పనులకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సంద్యా జగన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, తహశీల్దార్ సనత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు గడికొప్పుల ఉమ, సురేష్ నాయక్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విజిత్ రావు, కాంతయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : మునుగోడులో కేసీఆర్‌కు వరుస షాక్‌లు!

Tags:    

Similar News