కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.

Update: 2024-05-07 15:50 GMT

దిశ‌, మంచిర్యాల : కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.

     కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ హాళ్లు, కౌంటర్లు, విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు ఇతరత్రా పూర్తి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి డి.చంద్రకళ, హాజీపూర్ తహసీల్దార్ పి.సతీష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Similar News