షర్మిల మూడు రోజుల పాటు నిరాహార దీక్ష

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఖమ్మం వేదికగా సమరశంఖం పూరించిన వైఎస్ షర్మిల.. రాజకీయంగా మరింత యాక్టివ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసుకుని బలంగా ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజల సమస్యలపై పోరాడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 15 నుంచి మూడ్రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు […]

Update: 2021-04-10 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఖమ్మం వేదికగా సమరశంఖం పూరించిన వైఎస్ షర్మిల.. రాజకీయంగా మరింత యాక్టివ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసుకుని బలంగా ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజల సమస్యలపై పోరాడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 15 నుంచి మూడ్రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు అనచరులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేవరకు, తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు షర్మిల పోరాటం చేస్తారన్నారు.

షర్మిల నిరాహార దీక్ష చేసినా.. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లాల్లో కూడా నిరాహార దీక్ష చేయనున్నట్లు షర్మిల అనచరులు తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయలేదనే మనస్తాపంతో ఇటీవల ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News