ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే..!

పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులు బీటెక్‌, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్

Update: 2024-05-24 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులు బీటెక్‌, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు శుక్రవారం విడుదల చేశారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 10 నుంచి 12 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సాగనుండగా అదే రోజు నుంచి జూన్ 14 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 14న ఆప్షన్లను ఫ్రీజ్ చేయనున్నారు. కాగా జూన్ 18న సీట్లను అలాట్ చేస్తారు.

18 నుంచి 21వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూలై 17, 18 తేదీల్లో జరగనుంది. జూలై 21న సీట్లను అలాట్ చేయనున్నారు. కాగా 21 నుంచి 23 తేదీలోపు విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జూలై 24న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. జూలై 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇతర వివరాలకు https://tgecet.nic.in వెబ్ సైట్ పరిశీలంచాలని అధికారులు సూచించారు.

Similar News