బాలాపూర్‌‌ను తలపించిన మధురాపురం.. రికార్డు స్థాయిలో లడ్డూ వేలం

దిశ, షాద్‌నగర్: కరోనా కారణంగా గతేడాది బ్రేక్ పడిన గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది వైభవంగా జరిగాయి. నిమజ్జన వేడుకల్లో సైతం పలు మండపాల వద్ద గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాటలు జరిగాయి. తాజాగా.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటిసారిగా లడ్డూ భారీ ధర పలికింది. ఫరూక్‌నగర్ మండలం మధురాపురం రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ ఏకంగా రూ.13 లక్షల 62000 పలకడం విశేషం. […]

Update: 2021-09-20 11:27 GMT

దిశ, షాద్‌నగర్: కరోనా కారణంగా గతేడాది బ్రేక్ పడిన గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది వైభవంగా జరిగాయి. నిమజ్జన వేడుకల్లో సైతం పలు మండపాల వద్ద గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాటలు జరిగాయి. తాజాగా.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోనే మొట్ట మొదటిసారిగా లడ్డూ భారీ ధర పలికింది. ఫరూక్‌నగర్ మండలం మధురాపురం రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ ఏకంగా రూ.13 లక్షల 62000 పలకడం విశేషం. గతేడాది రెండున్నర లక్షలకు గ్రామస్తులు తీసుకోగా, ఈసారి కనీవినీఎరుగని స్థాయిలో పలికింది. ఈ లడ్డూను గ్రామానికి చెందిన రవీందర్ గుప్తా అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News