కరోనా టెస్టులు పెంచాలి :ప్రధాని మోదీ

దిశ, వెబ్‎డెస్క్: కరోనా మహమ్మారిని భారత్ ధైర్యంగా ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొందరి నిర్లక్ష్యం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని మోదీ తెలిపారు. కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్నారు. కరోనా పరీక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అన్నారు. కాగా, వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా 160 ఆక్సిజన్ జనరేషన్ […]

Update: 2020-11-24 04:39 GMT

దిశ, వెబ్‎డెస్క్: కరోనా మహమ్మారిని భారత్ ధైర్యంగా ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొందరి నిర్లక్ష్యం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని మోదీ తెలిపారు. కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్నారు. కరోనా పరీక్షలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు. తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అన్నారు. కాగా, వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా 160 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు.

Tags:    

Similar News