లైవ్‌లో జేబుదొంగను పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ (వీడియో వైరల్)

పిక్ పాకెంటింగ్ చేస్తున్న ఓ జేబుదొంగను పోలీస్ కానిస్టేబుల్ రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

Update: 2024-05-08 09:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పిక్ పాకెంటింగ్ చేస్తున్న ఓ జేబుదొంగను పోలీస్ కానిస్టేబుల్ రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి తన బైక్ పై సమాన్లు వేసుకొని వెళుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తన బండి ఆగిపోయింది. ఇది చూసిన జతిన్ అనే జేబు దొంగ ఇదే అదునుగా తన చేతి వాటం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. బైకర్ కు సహాయం చేస్తానని చెప్పి వ్యాపారిని మాటల్లో పెట్టాడు. ఆ వ్యాపారిని బైక్ మీదనే ఉంచి బండిని అటు ఇటు ఊపుతూ.. వ్యాపారి వెనుక జేబులోనుంచి పర్స్ లాగేశాడు.

ఇదంతా దూరం నుంచి గమణిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సచిన్ జేబు కాజేసే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి పిక్ పాకెటర్ ను పట్టుకున్నాడు. జతిన్ చేతిలో పర్స్ ఆ వ్యాపారికి ఇచ్చి అతనిపై కేసు నమోదు చేశాడు. జతిన్ పాత దొంగేనని అతనిపై ఇదివరకే పలు కేసులు నమోదు అయినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో లైవ్ పిక్ పాకెటింగ్ వీడియో వైరల్ గా మారింది. 

Similar News