ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ ప్రాంతాల్లో పుతిన్.. రష్యా అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటించారు.

Update: 2023-04-18 11:50 GMT

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటించారు. రష్యా అధీనంలోకి వచ్చాయని పేర్కొంటున్న భూభాగంలో పర్యటించినట్లు అధ్యక్ష వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఓ వైపు ఉక్రెయిన్ హెచ్చరికల నడుమ సైనికులను కలుసుకున్నట్లు తెలిపాయి. అయితే ఈ పర్యటన ఎప్పుడు చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఖెర్సాన్ దక్షిణ ప్రాంతం, లుగాన్స్క్ తూర్పు ప్రాంతంలో ఆయన పర్యటించినట్లు పేర్కొన్నాయి.

కాగా, గతేడాది ఫిబ్రవరిలో పుతిన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ అపరేషన్‌కు పంపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పుతిన్ పర్యటనను జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ఖండించారు. పుతిన్ పర్యటన తర్వాత ఖెర్సాన్‌లో రష్యా బలగాల క్షిపణి దాడిలో ఆరుగురు గాయపడ్డారు.

Tags:    

Similar News