ఓటింగ్ డేటాను బయటపెట్టడం వల్ల అనర్థాలు జరగొచ్చు- ఈసీ

ఓటింగ్ కు సంబంధించిన డేటా, 17సీని బహిర్గతంచేయడం వల్ల కౌంటిగ్ తో పాటు చిత్రాల మార్ఫింగ్ జరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈసీ.

Update: 2024-05-22 18:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓటింగ్ డేటాను ప్రచురించడాన్ని వ్యతిరేకించింది ఈసీ. ఓటింగ్ కు సంబంధించిన డేటా, 17సీని బహిర్గతంచేయడం వల్ల కౌంటిగ్ తో పాటు చిత్రాల మార్ఫింగ్ జరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈసీ. ఓటింగ్ డేటాను బయటపెట్టడం వల్ల ఫలితాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అలాగే ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై అపనమ్మకాన్ని సృష్టించగలవని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈసీ.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ పై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటింగ్ డేటా, ఫాం 17సీని బహిర్గతం చేయడం వల్ల అనర్థాలు జరగొచ్చని ఈసీ పేర్కొంది. సామాన్య ప్రజలకు 17సీ ఇచ్చేందుకు చట్టపరమైన హక్కు లేదని స్పష్టం చేసింది ఈసీ.

Similar News