యూకేలో జులై 4న ఎన్నికలు.. తొలిసారి ఓటర్లను ఎదుర్కోనున్న ప్రధాని

ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ పిలుపునిచ్చారు. జూలై 4న సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు.

Update: 2024-05-22 19:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ పిలుపునిచ్చారు. జూలై 4న సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కేబినేట్ భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రకటన తర్వాత.. శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం తెలిపింది.

యూకేలో రాజ్యాంగబద్ధంగా జనవరి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చాలా రోజులుగా ఊహాగానాలు వినబడుతున్నాయి. వాటికి తెరదించారు రిషి సునాక్. పార్లమెంటును రద్దు చేయమన్ని రిషి అభ్యర్థనను బ్రిటన్ రాజు ఆమోదించారు.

ఇకపోతే, 44 ఏళ్ల రిషి సునక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. అంతర్గత ఓట్ల ద్వారా 2022 అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన నియామకం అయ్యారు. 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం తర్వాత ఇది జరగబోయే మూడో సాధారణ ఎన్నికలు ఇవి. మరోవైపు, 14 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో కన్జర్వేటివ్‌లు ఓడిపోతారని ప్రీ-పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన కన్నా ముందే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని లేబర్ పార్టీ తెలిపింది.

Similar News