రాజస్థాన్ లో దారుణం.. బదిర బాలికపై అత్యాచారం

రాజస్థాన్ లోని కరౌలీలో మూగ,చెవిటి బాలిక అత్యాచారం, హత్య జరిగింది. అయితే ఈ కేసులో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవట్లేదని బాలిక తండ్రి ఆరోపించారు.

Update: 2024-05-22 18:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ లోని కరౌలీలో మూగ,చెవిటి బాలిక అత్యాచారం, హత్య జరిగింది. అయితే ఈ కేసులో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవట్లేదని బాలిక తండ్రి ఆరోపించారు. మే 11న కరౌలీ జిల్లాలోని న్యూ మండి పోలీస్ స్టేషన్‌లో బాలికపై హత్య, అత్యాచారం జరిగిందని కేసు నమోదైంది. మే 9 ఉదయం బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటోందని.. ఆమె అరుపులు విని కుటుంబసభ్యులు బయటకు వెళ్లారని అధికారులు తెలిపారు. దుస్తులు లేకుండా దీనిస్థితిలో బాలికను గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు తనను రేప్ చేసి నిప్పంటించినట్లు బాలిక సైగల ద్వారా తెలిపిందని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఘటన జరిగిన 11 రోజుల తర్వాత సోమవారం జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పోలీసులు ఇప్పటివరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో 15 మందిని ప్రశ్నించారు. అయితే, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బాలిక తండ్రి ఆరోపించారు. బాలిక తండ్రి ఆరోపణలను కరౌలీ ఎస్పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్ ఖండించారు. కుటుంబసభ్యుల నుంచి ప్రతిదీ తెలుసుకుంటున్నామని అన్నారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Similar News