పెరుగుపై తమిళనాట రగడ.. వెనక్కి తగ్గిన ఆహార భద్రత సంస్థ

Update: 2023-03-30 12:24 GMT

చెన్నయ్: పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్‌తో పాటు హిందీ పేర్లను మాత్రమే వాడాలని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఆదేశాలపై వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయాన్ని సదరు సంస్థ వెనక్కి తీసుకుంది. ప్రాంతీయ భాషలోనూ పాలు, పాలతో తయారైన పదార్థాల ప్యాకెట్లపై స్థానిక భాషలను ఉపయోగించివచ్చని అనుమతించింది. ఈ మేరకు సవరించిన నిబంధలను గురువారం ట్వీట్ చేసింది. కర్డ్ అని ఇంగ్లీష్ పేరుతో పాటు స్థానిక భాషను బ్రాకెట్లతో ఉపయోగించుకోవచ్చని పత్రికా ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు స్థానిక భాషలను తొలగించి దహీ అనే పదాన్ని వాడాలని ఆహార భద్రత సంస్థ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తమిళనాట తీవ్ర ఆగ్రహాం ఎదురైంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయని విమర్శించారు. హిందీని తమపై రుద్దే ప్రయత్నాలు ఉచ్ఛ స్థాయికి చేరాయని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. తమ మాతృభాషలను తక్కువ చేసేవారిని చూసే వారిని దక్షిణాది నుంచి నిషేధం విధిస్తామని హెచ్చరించారు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆహార భద్రత సంస్థ వెనక్కి తగ్గింది.

Tags:    

Similar News