మోడీ వారణాసికి ఎందుకు పారిపోయాడో అడగండి: మల్లికార్జున ఖర్గె

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె రాహుల్ గాంధీపై విమర్శలకు గట్టిగా బదులిచ్చారు

Update: 2024-05-03 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీకి నామినేషన్ వేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా మొదలు బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె రాహుల్ గాంధీపై విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. 'ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం వదిలి వారణాసికి ఎందుకు పారిపోయాడో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఆయన ఎందుకు సొంత రాష్ట్ర నుంచి పారిపోయాడో అడగండని' మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం కేరళలోని వాయనాడ్‌లో ఇప్పటికే రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం రాయ్‌బరేలీలోనూ పోటీకి సిద్ధమవడంపై ప్రధాని మోడీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ మరో కంచుకోట అయిన అమేఠీలో ఓటమి తప్పదనే భయంతోనే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ అన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి గెలిచిన రాహుల్, ఐదేళ్లలో ఏమీ చేయలేదని, అందుకే అక్కడ కూడా ఓటమి ఎదుర్కొనలేక ఇప్పుడు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీకి దిగారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News