హర్యానాలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం

హర్యానాలో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Update: 2023-02-18 11:38 GMT

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలోని యమునానగర్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. యమునానగర్ జిల్లా నహర్ పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియన దుండగులు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో అంబేద్కర్ విగ్రహం కుడి చేయి ధ్వంసం అయ్యింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలకు చెందిన నాయకులు, గ్రామస్థులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

Tags:    

Similar News