శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసిన పవన్.. పిక్స్ వైరల్

స్టార్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లిసిటిని చాటుకున్నాడు.

Update: 2023-03-30 07:56 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి తన సింప్లిసిటిని చాటుకున్నాడు. శ్రీ రామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. ‘ధర్మం మూర్తీభవించిన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు. తాను రక్షిస్తానని అభయమిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వెనుదిరగకుండా రక్షించగల కరుణారస మూర్తికి శ్రీరామనవమి వేడుకలవేళ, భక్తిపూర్వకంగా ప్రణతులర్పిస్తున్నాను’ అంటూ నెట్టింట అభిమానులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశాడు. ఇందులో చాప మీద కూర్చుని ఒక సాధారణ మనిషిలా పవన్ పూజలు చేయడం విశేషం.

Tags:    

Similar News