రాడిసన్ హోటల్‌కు మోడీ రూ. 80 లక్షలు బిల్ బాకీ..! ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్

ప్రధాని నరేంద్ర మోడీ ఓ హెటల్‌లో బస చేసిన ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదంట. ఓ హోటల్‌లో ప్రధాని మోడీ బస చేసి.. రూ. 80.6 లక్షలు బాకీ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Update: 2024-05-25 09:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఓ హెటల్‌లో బస చేసిన ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదంట. ఓ హోటల్‌లో ప్రధాని మోడీ బస చేసి.. రూ. 80.6 లక్షలు బాకీ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. 2023 ఏప్రి‌ల్‌లో బెంగళూరు రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేసి, బిల్లు కట్టాలని అడిగితే కట్టడం లేదన్న విషయాన్ని సినీ నటుడు ప్రకాష్ రాజ్ బయట పెట్టారు. ఈ మేరకు ఆయన ది హిందూలో వచ్చిన కథనం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దేవుడు పంపిన నాన్-బయోలాజికల్ జీవి నుంచి బిల్లును మానవులు ఎలా క్లెయిమ్ చేస్తారంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్‌లో ప్రశ్నించారు.

అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ప్రాజెక్ట్ టైగర్ 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాని మోడీ మైసూరుకు వచ్చారు. ఈ క్రమంలోనే రూ. 80.6 లక్షల హోటల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం పేర్కొంది. కానీ నేటికి ఆ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని, ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యం ఈ బిల్లులపై కోర్టుకు వెళ్లనున్నట్లు ది హిందూ పత్రిక నివేదించింది.

Tags:    

Similar News