ప్రభాస్ బుజ్జిపై నాగచైతన్య చక్కర్లు.. వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.

Update: 2024-05-25 09:34 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “. వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

అందులో భాగంగా ప్రభాస్ తో పాటు బుజ్జి అనే రోబోటిక్ కారు పాత్రని మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ కారుని దాదాపు రూ.8.5 కోట్ల ఖర్చుతో డిజైన్ చేసి రూపొందించారు. కేవలం రీల్ స్టోరీ కోసం రియల్ గా ఓ కారుని రూపొందించడం ఒక ఆకర్షణ అయితే.. దాని డిజైన్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకోవడం మరో స్పెషల్ అట్రాక్షన్.

అయితే తాజాగా టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య బుజ్జి పై మనసు పారేసుకున్నాడు. కార్లు అన్న, కారు రేసింగ్స్ అన్న చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన మోటో రేసర్స్ కి కూడా చైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. మరి కార్లు అంటే అంత పిచ్చి ఉన్న నాగచైతన్య.. ప్రత్యేక సమయం తీసుకోని మరి బుజ్జిని చూడడానికి కల్కి టీం వద్దకు వచ్చేసారు. అంతేకాదండోయ్ బుజ్జితో కలిసి ఒక సూపర్ ఫాస్ట్ రైడ్ కి కూడా వెళ్లారు. ఇక అందుకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోని కల్కి మేకర్స్ నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Similar News