ఈ లవ్‌లీ మూమెంట్‌ను మీతో పంచుకోవాలి అనుకున్నాను.. నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రస్తుతం ‘ఫుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది.

Update: 2024-05-25 11:00 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రస్తుతం ‘ఫుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్స్‌లో బిజీగా ఉంటునప్పటికీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది రష్మిక. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకోవడంతో పాటు.. తన స్వీట్ మూమెంట్‌ను సైతం అభిమానులతో షేర్ చేసుకుటుంది. ఈ మేరకు తాజాగా రష్మిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

రష్మికకు తన పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడూ వాటితో టైం స్పెండ్ చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా తన పెట్స్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. ‘నేను ఎప్పుడు వెతికిన నా చుట్టూ బొచ్చు దొరుకుతూనే ఉంటుంది. అయినా వీటితో టైం స్పెండ్ చెయ్యడం ఎంతో సంతోషంగా ఉంటుంది. వీటికి సంబంధించిన కొన్ని లవ్‌లీ మూమెంట్స్‌ను నేను మీతో పంచుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ ఫొటోలను షేర్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక పంచుకున్న ఈ క్యూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News