Pawan Kalyan: పవన్ కల్యాణ్ నిర్మాతలకు షాక్ ఇవ్వనున్నారా..?

Producers to be troubled due to pawan kalyan statewide tour decision| పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో కొత్త శక్తిని తీసుకురావడానికి అక్టోబర్ నుంచి

Update: 2022-06-11 08:24 GMT

దిశ, సినిమా: Producers to be troubled due to pawan kalyan statewide tour decision| పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో కొత్త శక్తిని తీసుకురావడానికి అక్టోబర్ నుంచి రాజకీయ యాత్ర ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఆయన చేతిలో మూడు సినిమా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, వినోదయ సీతమ్ రీమేక్. ఈ మూడు ప్రాజెక్ట్‌లు చేతిలో ఉన్నందున పవన్ కల్యాణ్ ఖచ్చితంగా ఈ సమయంలో తన నిర్మాతలందరికీ సమాన సమయాన్ని ఇచ్చే పరిస్థితిలో లేరు. సహజంగా నిర్మాతలు విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌ను పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం 3 నెలల్లో 3 ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. అదే విషయాన్నిపవన్ కల్యాణ్‌కు తెలియజేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరి పవన్ షూటింగ్‌లు పూర్తి అయ్యాక పార్టీ వైపు వెళ్తారా.. లేక ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే షూటింగ్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంతకు పవన్ తన మనసులో ఏమి ఆలోచిస్తున్నాడో తెలియదు.. చూడాలి మరి నిర్మాతలు ఎలాంటి సవాల్‌లను ఎదుర్కోనున్నారో.


Also Read: చిరు బాటలో పవన్.. తిరుపతి నుంచే పొలిటికల్ టూర్

Tags:    

Similar News