అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్స్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్!

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత ఐటమ్ సాంగ్స్, చేయడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో అందరినీ

Update: 2024-05-04 03:33 GMT

దిశ, సినిమా : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత ఐటమ్ సాంగ్స్, చేయడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ, తన హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా ఒక్కోసారి వివాదాస్పద కామెంట్స్ చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తోంది.

ఇక ప్రస్తుతం అనసూయ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమాలో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. అంతే కాకుండా అందులో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకొని స్టెప్స్ వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ ఈ స్టెప్స్‌పై స్పందిస్తూ , ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ చేసిన ఈ సాంగ్‌లోని గ్లాస్ స్టెప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నీ పేరే నీ బ్రాండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించడమేకాకుండా ఆ టీ గ్లాస్ తో డాన్స్ చేయడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప 2 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్స్ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Similar News