ఆ హాలీవుడ్ మూవీ చూశాక ఆ పని చేయడం ఆపేశా... తమన్నా కామెంట్స్ వైరల్

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామకు ఇప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.

Update: 2024-05-04 03:56 GMT

దిశ,సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామకు ఇప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆమె సరైన కథ ఎంచుకోలేకపోతుంది. బాహుబలి తరువాత తమన్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ సినిమా తర్వాత పైగా మరింత కిందకి వెళ్లి నట్టుగా అనిపించింది.

తమన్నాకు ఇంత వరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదనే చెప్పాలి. ఈమెకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీతో కలిసి తమన్నా నటించింది. ఆమె కెరీర్‌లో హిట్‌ల కంటే ఫ్లాపులే ఎక్కువ. అయితే తన అందం, పర్సనల్ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తమిళంలో నటించిన "అరుణ్మనై 4" అనే సినిమా మే 3వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో "బాక్" అనే టైటిల్ తో విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తమన్నా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఇంటర్వ్యూ లో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఓ సినిమా చూశాక తనకున్న ఒక అలవాటును పూర్తిగా మానేసినట్లు చెప్పుకొచ్చింది. ఈమె హాలీవుడ్ లోని ‘హౌస్ ఆఫ్ వ్యాక్స్’ సినిమా చూశాక తన చర్మం పై వెంట్రుకలు తొలగించడం పూర్తిగా మానేశాను అని ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారు అని , ఆ మూవీ తర్వాత నుంచి చర్మంపై రోమాలను తొలగించడం మానేసినట్లు మిల్కీ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పింది.

Read More..

శారీలో ఫ్రంట్.. బ్యాక్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న కాజల్..! 

Similar News