Fighter Twitter Review : హృతిక్ . హిట్ కొట్టినట్టేనా?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘ఫైటర్’. ఇందులో దీపికా పదుకొణె నటించగా.. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు.

Update: 2024-01-25 04:47 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘ఫైటర్’. ఇందులో దీపికా పదుకొణె నటించగా.. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ పెద్ద అడ్వాన్స్ బుకింగ్స్ జరగనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా గణతంత్ర దీనోత్సవం కానుకగా నేడు జనవరి 25న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి.

ఈ చిత్రం చూసిన వారంతా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఏరియల్ షాట్స్,అసలు ఈ ఏరియల్ జానర్‌లో సినిమా తీయడం హైలెట్ అని పోస్టులు పెడుతున్నారు. ఫైటర్ మాస్టర్ పీస్.. మెగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్.. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌, పేట్రియాటిజం ఇలా అన్నీ కలగలపి చూపించారు.. హృతిక్ పర్ఫామెన్స్, సిద్దార్థ్ డైరెక్షన్ అద్భుతం.. బాక్సాఫీస్ వద్ద సునామి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి హృతిక్ రోషన్ ఫైటర్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.

Tags:    

Similar News