కూతురు చేసిన పనికి గర్వపడుతున్న.. జ్యోతిక, సూర్య..!!

కోలీవుడ్ స్టార్ కపూల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ప్రొఫెషనల్ గానూ వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. సూర్య ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Update: 2024-05-09 02:50 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ కపూల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ప్రొఫెషనల్ గానూ వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. సూర్య ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే జ్యోతిక కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘సైతాన్’ మూవీ తో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సూర్య, జ్యోతికల జంటకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరు నెట్టింట ఏపోస్టు పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా వీరి కూతురు చేసిన పనికి గర్విస్తున్నారు. ఇక వీరి పిల్లల చదువుపై గట్టిగా ఫోకస్ చేసిన ఈ స్టార్ కపుల్, అందులో భాగంగానే ముంబైలోని చాలా మంది బిలియనీర్ల పిల్లలు చదువుకునే ధీరూబాయి అంబానీ స్కూల్‌లో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు.

ఇక ఈ ఏడాది వారి కుమార్తె దియా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. ఆమె తమ తల్లీ తండ్రులు గర్వించేలా దియా 600 మార్కులకు 581 సాధించింది. ప్రస్తుతం ఆమె మార్కులకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు సూర్య కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ జంట ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ వార్త వైరల్ అవుతోంది.

Similar News