భార్యకు అన్యాయం చేసిన రణ్ బీర్.. బాబీ2తో పిల్లను కనేశాడు..

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ' యానిమల్ ' మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కానీ సినిమా చాలా హింసాత్మకంగా ఉందని..

Update: 2024-05-08 17:08 GMT

దిశ, సినిమా : రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ' యానిమల్ ' మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కానీ సినిమా చాలా హింసాత్మకంగా ఉందని.. భార్యను అసలు లెక్క చేయని క్యారెక్టర్ తో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విమర్శకులు విరుచుకుపడ్డారు. సొంత ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఈ మూవీకి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ వాటన్నింటినీ లైట్ తీసుకున్న దర్శకుడు.. ప్రతి ఒక్కరికీ దిమ్మతిరిగే సమాధానాలు చెప్తూ వచ్చాడు. ఎవరేం అనుకున్నా ఫైనల్ గా సినిమానే ఆన్సర్ చేస్తుందని.. ఆడియన్స్ కు నచ్చితే చాలని చెప్పాడు.

ఇక ఇదిలా అంటే ఈ చిత్రం హీరోహీరోయిన్లకు ఎంత పేరు తెచ్చిందో బాబీ2 గా నటించిన తృప్తి కూడా అంతే ఫేం పొందేలా చేసింది. ఈ బ్యూటీ ఓవర్ నైట్ నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ఇలాంటి పోలికలతో ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో చూసిన జనాలు తెగ వైరల్ చేస్తున్నారు. రణ్ బీర్ భార్యకు అన్యాయం చేసి.. బాబీ2తో పిల్లను కన్నేశాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి ట్రెండ్ అవుతుండగా.. అల్ ది బెస్ట్ చెప్తున్నారు జనాలు.

Similar News