నా భార్యను దారుణంగా అవమానించారు.. నా కూతురి మొఖం మరిచిపోయా.. నేను భ్రష్టుపట్టిపోయా.. యాంకర్ రవి ఎమోషనల్

యాంకర్ రవి అనగానే ఒకప్పుడు లాస్య గుర్తుకువచ్చేది. వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రోగ్రామ్ అంత హిట్ అయింది. వారి కెమిస్ట్రీకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

Update: 2024-05-08 16:05 GMT

దిశ, సినిమా: యాంకర్ రవి అనగానే ఒకప్పుడు లాస్య గుర్తుకువచ్చేది. వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రోగ్రామ్ అంత హిట్ అయింది. వారి కెమిస్ట్రీకి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అందుకే రవి పెళ్లి చేసుకుని భార్య, కూతురు ఉన్నా ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడు. కాగా తాజా ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ఆయన.. ' ఆ విషయంలో చాలా తప్పు చేశా. నా భార్య ఆయన నా భర్త అంటే అవమానించారు. ఆ యాంకర్ భర్తను నీ భర్త అని చెప్పుకుంటున్నావని తిట్టారు. ఆ దారుణాలన్నింటికి కారణం నేనే ' అని చెప్పాడు.

ఇక బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడిన ఆయన.. పర్సనల్ లైఫ్ పై చాలా ఇంపాక్ట్ చూపుతుంది అన్నాడు. అక్కడి గొడవలు మైండ్ లో పెట్టుకుని కూతురు మొఖం కూడా మరిచిపోయానన్న యాంకర్ .. ఆ టైంలో అంత ఘోరంగా భ్రష్టుపట్టి పోయినట్లు అనిపించింది అన్నాడు. ఇక ఖచ్చితంగా పిసినారినే అని.. ప్రతి దానికి లెక్క చూస్తానని.. మనీ ఇస్తేనే ఈవెంట్స్ చేస్తానని చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదని క్లారిటీ ఇచ్చాడు రవి. తనకు ఒక పని వచ్చినప్పుడు ఫ్రీగా చేసే బదులు డిమాండ్‌గా చేయడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డాడు. 

Similar News