ముఖ్యమంత్రి సారూ.. ఇయ్యాల్టికి రెండేళ్లు

ఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ప్రకటించి శుక్రవారం నాటికి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తుంది. ఈ సందర్భంగా గత 47 రోజులుగా పే స్కేల్ అమలు చేయాలని

Update: 2022-09-09 09:16 GMT

దిశ, కామారెడ్డి రూరల్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని ప్రకటించి శుక్రవారం నాటికి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తుంది. ఈ సందర్భంగా గత 47 రోజులుగా పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో ఉన్న వీఆర్ఏలు తమదైన శైలిలో సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. 'వీఆర్ఏల పే స్కేల్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించి నేటికి రెండేళ్లు పూర్తయింది.

47 రోజులుగా సమ్మె చేస్తున్నా కనికరించని ప్రభుత్వం.. అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోని సీఎం హామీ' మిత్రులందరికీ పే స్కేల్ ప్రకటన ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. పే స్కేల్ అమలు కాకపోవడంతో వీఆర్ఏలు ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ స్పందించి మరొక వీఆర్ఏ బలి కాకముందే ఇచ్చిన హామీ అమలుకు కృషి చేయాలని కోరుతున్నారు.

Also Read 'కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరు': Hemanth Biswa Sarma 

Similar News