600 కిలోల స్వీట్లతో అమ్మవారికి అలంకరణ

దిశ, మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో అమ్మవారిని 600 వందల కిలోల స్వీట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గా అమ్మవారి ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ, భక్తులు ఈ వినూత్న పూజలు చేశారు. తెలంగాణలోనే మొదటిసారిగా సీట్లతో అలంకరణ చేసినట్లు భక్తులు పేర్కొంటున్నారు. స్వీట్ల అమ్మవారిని చూసేందుకు మండల ప్రజలు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. త్రిశక్త్యాత్మక చండీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మ శ్రీ కొంకపాక […]

Update: 2021-10-13 11:15 GMT

దిశ, మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో అమ్మవారిని 600 వందల కిలోల స్వీట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వనదుర్గా అమ్మవారి ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ, భక్తులు ఈ వినూత్న పూజలు చేశారు. తెలంగాణలోనే మొదటిసారిగా సీట్లతో అలంకరణ చేసినట్లు భక్తులు పేర్కొంటున్నారు. స్వీట్ల అమ్మవారిని చూసేందుకు మండల ప్రజలు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. త్రిశక్త్యాత్మక చండీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మ శ్రీ కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ దంపతుల ఆధ్వర్యంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో వేద మూర్తులు భాను కిరణ్ శర్మ, సాయి గోపాల్ శర్మ, సురేంద్ర, ధర్మేందర్, హరి లక్ష్మణ్ శర్మ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News