ఓయూ విద్యార్థుల నిరసనకు దిగోచ్చిన ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం ఆదేశాలు

తెలంగాణ ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లో గత ఐదు రోజులుగా తాగు నీరు, నీరు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-04-29 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లో గత ఐదు రోజులుగా తాగు నీరు, నీరు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో యూనివర్సిటీ లో పలు సమస్యల కారణంగా 30 రోజుల పాటు యూనివర్సిటీకి సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని.. ప్రధాన సమస్యలైన విద్యుత్, తాగునీటి సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించామని.. విద్యార్థులేవరు ఆందోళన చెందవద్దని భట్టి తెలిపారు. అలాగే విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Read More...

Big Alert: UGC NET పరీక్ష తేదీల్లో మార్పు..రీషెడ్యూల్ ఇదే! 

Tags:    

Similar News