కేసీఆర్ అధ్యక్షతన 16న క్యాబినెట్ సమావేశం

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 16న క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించే అంశాలతోపాటు ప్రతిపక్షాలు వేసే పలు ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై, మరో నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో పథకానికి […]

Update: 2021-09-14 06:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 16న క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించే అంశాలతోపాటు ప్రతిపక్షాలు వేసే పలు ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై, మరో నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో పథకానికి అర్హులను ఎంపిక, లబ్ధిదారులు ఏర్పాటు చేయదలచుకున్న యూనిట్లపై అవగాహన, అధికారులకు మార్గదర్శకాలు తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News