సీఎంను కలవాలంటే అరెస్టు చేస్తారా: శైలజానాథ్​

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని విషయంపై సీఎం జగన్​ను కలవాలని లెటర్ ​రాస్తే.. కాంగ్రెస్ ​పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ​ప్రశ్నించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉచిత విద్యుత్​కు మంగళం పాడొద్దని, రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేయాలని సీఎంను కోరేందుకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాని దైతే జగన్, చంద్రబాబు ఎందుకు సవాళ్లు విసురుకుంటున్నారని నిలదీశారు. ప్రాజెక్టు విషయంలో […]

Update: 2020-12-05 09:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని విషయంపై సీఎం జగన్​ను కలవాలని లెటర్ ​రాస్తే.. కాంగ్రెస్ ​పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ​ప్రశ్నించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉచిత విద్యుత్​కు మంగళం పాడొద్దని, రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేయాలని సీఎంను కోరేందుకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాని దైతే జగన్, చంద్రబాబు ఎందుకు సవాళ్లు విసురుకుంటున్నారని నిలదీశారు.

ప్రాజెక్టు విషయంలో మొదటి ముద్దాయి చంద్రబాబు అయితే అసలు ముద్దాయి జగన్​అని విమర్శించారు. శాసనసభ సమావేశాల తీరును ప్రజలు చీదరించుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ మంత్రులకు అరవడం కరవడం తప్ప మరొకటి తెలియదని ఎద్దేవా చేశారు. మరోసారి మాట్లాడేందుకు సీఎంకు లేఖ రాస్తానన్నారు. అప్పటికీ స్పందించకుంటే ఏం చేయాలో అది చేస్తామని శైలజానాథ్​వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News